
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో భారత అద్భుతమైన విజయాన్ని పొందింది. మ్యాచ్ గెలిచినా తరువాత భారత మహిళల జట్టుతో పాటు మ్యాచ్ వీక్షించడానికి వచ్చినటువంటి స్టార్ క్రికెట్ ప్లేయర్స్ అలాగే పలువురు ప్రముఖులు ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే భారత మహిళల జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. నిన్న రాత్రి టీమ్ ఇండియా గెలిచిన తర్వాత ఇండియా మాజీ కెప్టెన్, హిట్ మాన్ రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ మ్యాచ్ చూడ్డానికి ముంబైలోని డివై పాటిల్ స్టేడియనికి వచ్చినటువంటి రోహిత్ శర్మ టీమిండియా గెలవగానే ఆకాశాన్ని చూస్తూ బాగోద్వేగానికి గురయ్యారు. కాగా 2023 వన్డే వరల్డ్ కప్పులో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ వరకు వచ్చి ఓటమిపాలైన విషయం ప్రతి ఒకరికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఒక కెప్టెన్ గా ఆ మ్యాచ్ ఓడిపోవడంతో రోహిత్ శర్మ కళ నెరవేర లేకపోయింది. మరోవైపు 2027 లో రోహిత్ శర్మ ఆడుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారినా.. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడాలి అని ఫాన్స్ అయితే కోరుకుంటున్నారు. కాగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో శఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. టీమిండియా ఘన విజయం సాధించడంతో భారతదేశ వ్యాప్తంగా సంబరాలతో తెగ పండుగ చేసుకుంటున్నారు.
Read also : అనుమానం పెనుభూతంగా మారింది.. వికారాబాద్ జిల్లాలో ఘోరం!
Read also : మా నాన్న ఏ తప్పు చేయలేదు.. కక్ష సాధింపులుతోనే ఇలా చేస్తున్నారు : జోగి రాజీవ్





