
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో హఠాత్తుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వ్యవసాయ రంగ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిన్న మొన్నటి వరకు.. తుఫాన్ కారణంగా కురిసినటువంటి భారీ వర్షాలకు చాలానే పంటలు దెబ్బతినగా ప్రభుత్వం కొంత ఆర్థికంగా సహాయం చేసింది. అయినప్పటికీ కూడా మళ్లీ.. హఠాత్తుగా కురుస్తున్నటువంటి వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. తుఫాన్ ప్రభావం నుంచి కోలుకునే లోపే మళ్ళీ ఇవాళ కురిసినటువంటి వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈరోజు ఎవరు ఊహించని విధంగా వర్షం పడడం వల్ల వరంగల్ లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉంచినటువంటి మొక్కజొన్న, పత్తి పూర్తిగా వానకు తడిసి ముద్దయ్యాయి. ఎన్నో నెలలుగా కష్టపడి పండించినటువంటి రైతు… ఈ అకాల వర్షాలకు పడిన కష్టమంతా కూడా వృధా అయిపోయింది. అనుకోకుండా పడినటువంటి భారీ వర్షాలకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో రైతులు అలానే చూస్తూ ఉండిపోయారు. మరి కొంతమంది రైతులు తడుస్తున్న పత్తి మరియు మొక్కజొన్నను చూస్తూ ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం ఇటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని కోరారు. లేదంటే ఇటువంటి సందర్భాలలో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read also : ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు .. భక్తులు ఇవి పాటించాల్సిందే!
Read also : గెలిచిన మహిళలకు బహుమతిగా వజ్రాల ఆభరణాలు!
				
					
						




