తెలంగాణరాజకీయం

జమిలి దిశగా అడుగులు – 2029లో తెలంగాణ ఎన్నికలు – ఎవరికి నష్టం, ఎవరికి లాభం..!

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- జమిలి… జమిలి.. కొనేళ్లుగా ఈ పదం వింటున్నాం. జమిలి ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తోంది వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ.. క్లారిటీ మాత్రం లేదు. ఇప్పుడు కూడా జమిలి ఎన్నికలపై కొత్త ప్రచారం జరుగుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్‌… జమిలి ఎన్నికల నిర్వహణకు గట్టిగా ప్రయత్నిస్తోందట. ఒక విడతలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే… రెండు విడతల్లో నిర్వహించాలని భావిస్తోందట. మొదటి విడతగా.. దేశంలోని సగం రాష్ట్రాలకు 2029లో ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ ప్లాన్‌గా తెలుస్తోంది. అదే జరిగితే… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా 2029లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు… దేశంలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగేవి. ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా… 2014లో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు.. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే జరిగాయి. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… ఏపీలో అలాగే జరిగాయి. కానీ.. తెలంగాణలో మాత్రం అప్పటి సీఎం కేసీఆర్‌.. ఆరు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్తారు. దీంతో.. 2018లో తెలంగాణ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత… ఐదేళ్లకు 2023లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈసారి 2028లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటంతో…. పార్లమెంట్‌ ఎన్నికలతో కలిపి తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ఉంది. అదే జరిగితే… ఈసారి ఆరేడు నెలలు ఆలస్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

2029 తొలివిడత జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్న కేంద్రం… ఆ సమయానికి ఏడాది ముందు గానీ, ఏడాది తర్వాత గానీ జరాగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను 2029లోనే నిర్వహించాలని భావిస్తోంది. అంటే.. 2028, 2030లో ఎన్నికల జరగాల్సిన రాష్ట్రాలను ఒక కేటగిరీగా చేసి.. 2029లో పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించబోతోంది. 2029లో జమిలి ఎన్నికలకు వెళ్తే.. తెలంగాణ, ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, హర్యాణ, జార్ఖండ్‌, మహారాష్ట్రలతోపాటు మొత్తం 16 రాష్ట్రాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button