
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-శీతాకాలం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను పొగ మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజామున కనిపించేటటువంటి పొగ మంచు కారణంగా ఏపీ & తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ దేశమంతా కూడా వాహనదారులు చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ మంచు కారణంగానే పలు విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్, హైదరాబాదు నుంచి ఢిల్లీ వైపు ప్రయాణించేటువంటి ఎయిర్ ఇండియా విమానం, హైదరాబాదు నుంచి తిరుపతి, తిరుపతి నుంచి హైదరాబాద్ ప్రయాణించేటువంటి విమానం ఈ పొగ మంచు కారణంగా కాస్త ఆలస్యం అయ్యాయి.
Read also : సంక్రాంతికి బరిలో తోపు మూవీస్.. మరి టికెట్ రేట్ల సంగతేంటి?
తెల్లవారుజామున ఉన్నటువంటి పొగ మంచు కారణంగా తాజాగా శంషాబాద్ మరియు బెంగళూరు నేషనల్ హైవే పై దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే ఈ పొగ మంచు కారణంగా సరిగా కనపడక కొన్ని రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే బేధాలు లేకుండా పొగ మంచు ప్రతిచోట కూడా కప్పి వేసింది. దీంతో నేషనల్ హైవే లతోపాటు సాధారణ రహదారులు కూడా రద్దీగా మారిపోతున్నాయి. దీంతో అధికారులు తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలి అని.. లేదంటే కచ్చితంగా ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది అని సూచిస్తున్నారు. కానీ ఎమర్జెన్సీ వలన లేక కచ్చితమైన ప్రయాణాల కారణంగా ప్రజలు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో తప్పక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Read also : శ్రీశైలం పాతాళగంగ సమీపంలో అర్ధరాత్రి చిరుత పులి కలకలం?





