Tuesday, February 24, 2026
Homeక్రైమ్హైదరాబాద్‌ కోఠి లో కాల్పులు: ముగ్గురు అరెస్ట్ వారిలో ఒకరు తెలిస్తే షాక్..!

హైదరాబాద్‌ కోఠి లో కాల్పులు: ముగ్గురు అరెస్ట్ వారిలో ఒకరు తెలిస్తే షాక్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: గత జనవరి 31న హైదరాబాద్‌ కోఠి లోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద రూ. 6 లక్షల నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన కేరళ వ్యాపారి రిన్షద్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదుతో పరారైన విషయం అందరికి విధితమే. అయితే కాల్పులు, దోపిడీ కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించి, నిందితులందరినీ అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. ఈ కేసులో ప్రధాన నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న హర్యానాలో ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడిని నేడు (ఫిబ్రవరి 24, 2026) అరెస్ట్ చేశారు అని సమాచారం.

నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన తుపాకీ మరియు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. నిందితులకు పాతబస్తీలో ఆశ్రయం కల్పించిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించి అరెస్ట్ చేశారు సమాచారం. అయితే అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వీరిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments