క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: అమాయక ప్రజల ఆర్థిక ఇబ్బందులను, అవసరాలను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు విసిరే వలలు సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మహిళ అవసరాలను ఆసరాగా చేసుకున్న ఓ ముఠా ఆమెకు నీలి చిత్రాల పేరు చెప్పి దారుణంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్ లోని నగరంలో కలకలం రేపింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. నీలి చిత్రాలలో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ అంటూ కొందరు వ్యక్తులు ఒక వివాహితకు ఆఫర్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు మహిళ వారు చెప్పిన మాటలు నమ్మింది. బ్లూ ఫిల్మ్ చిత్రీకరిస్తామంటూ ఆ మహిళను ఒక హోటల్ గదికి తీసుకెళ్లిన దుండగులు, షూటింగ్ పేరుతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమెకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి యూసఫ్‌గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులు ఎవరు ? దీని వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, అపరిచితులు ఇచ్చే భారీ ఆఫర్ల వెనుక పెద్ద ప్రమాదాలు పొంచి ఉంటాయని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.





