
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ అనేది దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు కారణమైన నిందితుడు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఇంటిని మన భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఉన్నటువంటి అతడి ఇంటిని అనూహ్యంగా నేలమట్టం చేశారు. కాగా ఈ నిందితుడు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారులో బాంబును పేల్చడం ద్వారా దాదాపు 13 మంది మృతి చెందారు. అనేకమంది గాయాలు పాలు కూడా అయ్యారు. నిందితుడి i20 కార్ లో బ్లాస్టింగ్ చేసింది ఉమర్ మహమ్మద్ అని విచారణలో భాగంగా తేలింది. ఈ ఘటన ద్వారా యావత్ భారతదేశం అంతట కూడా భయాందోళనకు గురైంది. దేశంలోని ప్రధాన నగరాలు అన్నిట్లో కూడా హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి ఉగ్రవాదులను వెంటనే ఏరిపారేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇలాంటి ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న సమయంలో నిందితుడి ఇంటిని కూల్చివేసి ప్రజలకు కాస్త శాంతి చేకూర్చారు. మరోవైపు ఇంటిని కూల్చితే సరిపోదు అంటూ.. ఉగ్రవాదులను అంతం చేయాలని కోరుతున్నారు.
Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నవీన్ యాదవ్ ముందంజ!
Read also : దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే సినిమా హిట్టా?.. ఫ్లాపా?.. పబ్లిక్ రివ్యూ!





