
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ రేపు జరగనుంది. అయితే ఇప్పటికే పెర్త్ లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పొందింది. మొదటి వన్డే మ్యాచ్ లో భాగంగా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, అయ్యర్ వీరందరూ కూడా చాలా తక్కువ పరుగులకే అవుట్ అయ్యి మ్యాచ్ ఓటమికి కారణమయ్యారు. మరి రేపు జరగబోయేటువంటి సెకండ్ వన్డే మ్యాచ్ అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో జరగనుంది. ఈ మైదానంలో మన భారత జట్టుకు తిరుగులేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అడిలైడ్ గ్రౌండ్ లో 15 వన్డే మ్యాచ్ లాడిన భారత్ 9 మ్యాచ్లలో విజయం సాధించింది. గత 17 సంవత్సరాలుగా చూసుకుంటే భారత్ జట్టు ఈ మైదానంలో ఒక్కసారి కూడా ఓడిపోయిన దాఖలు లేవు. కాబట్టి ఈ గ్రౌండ్ మన భారత్ కు కలిసి వచ్చే అవకాశం ఎంతగానో ఉంది. మరోపక్క స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ రానిస్తేనే రేపు భారత జట్టు గెలిచి సిరిస్ పై ఆశలు నిలుపుకోవాలని తెగ ట్రై చేస్తుంది. మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడంతో ఇండియన్ అభిమానులు కూడా చాలా నిరాశలో ఉన్నారు. దీంతో రేపైనా ఇండియా విజయాన్ని సాధించి ఫాన్స్ ముఖాల్లో సంతోషం నింపాలని కోరుతున్నారు.
Read also : తెలంగాణలో మరో 4 రోజులు పాటు వర్షాలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Read also : ఏపీ ఇంటర్ విద్యార్థులు అలర్ట్… పరీక్షల మార్కులలో మార్పులు?