Homeఆంధ్ర ప్రదేశ్కూటమిలో సీట్ల సర్దుబాటు...! ఎన్నిక‌ల‌కు మూడు పార్టీలు రెడీ...

కూటమిలో సీట్ల సర్దుబాటు…! ఎన్నిక‌ల‌కు మూడు పార్టీలు రెడీ…

  • చంద్రబాబు, పవన్, పివిఎన్ మాధవ్ భేటీ

  • అనంతరం పదవుల పంపకం పై కీలక ప్రకటన

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ క్షణం అయినా నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ తరుణంలో అధికార కూటమి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తోంది. క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటు కొలిక్కి తెచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సోమవారం భేటీ అయ్యారు. ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని కూటమి రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ మూడు పార్టీల బలాబలాలపై.. క్షేత్రస్థాయి నివేదికను సిద్ధం చేసి అధినేతలకు అందించింది.

ముందుగా పుర పోరు…

స్థానిక ఎన్నికల్లో భాగంగా ముందుగా మున్సిపాలిటీలకు ఎన్నిక జరగనుంది. అందుకే మున్సిపల్ ఎన్నికల సీట్ల పంపకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లలో మేయర్ స్థానాలు, మున్సిపల్ చైర్మన్లు తో పాటు డివిజన్లు, వార్డుల్లో ఎవరెవరికి కేటాయింపులు అనేదానిపై స్పష్టత రానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటి త్యాగాలు, ఓటు బ్యాంకు బదిలీని ప్రామాణికంగా తీసుకుంటూనే.. క్షేత్రస్థాయిలో పార్టీల గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చేలా ఫార్ములా అను రూపొందించినట్లు సమాచారం.

మూడు పార్టీల జాబితాలు…

పైగా మూడు పార్టీలు జాబితాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా, నియోజకవర్గస్థాయి నేతల నుంచి అందిన వినతులు, డిమాండ్ల ఆధారంగా తయారుచేసిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను పల్లా శ్రీనివాసరావు కమిటీ సమర్పించింది. సీట్ల కేటాయింపులో ఎలాంటి మనస్పర్ధలు రాకుండా, అసమ్మతి చెలరేగకుండా అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మూడు పార్టీల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఓట్లు గుంప గుత్తగా కూటమి అభ్యర్థులకు పడేలా నియోజకవర్గాల వారీగా జాయింట్ ఆక్షన్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

అధికారిక ప్రకటన…

నోటిఫికేషన్ వెలువడిన తర్వాత.. కూటమికి సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల కేటాయింపు పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, చంద్రబాబు అపార పాలన అనుభవం, పవన్ కళ్యాణ్ ప్రజాదరణ కలగలిపి కూటమిని స్థానిక పోరులో తిరుగులేని శక్తిగా నిలబెడతాయని కూటమి పార్టీ శ్రేణులు భీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ భేటీ అనంతరం ఏపీ రాజకీయాలు, సమీకరణలు మరింత వేడెక్కడం ఖాయం.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ప్రభుత్వానికి భయం పట్టుకుంది’.. ఢిల్లీలో యువత అరెస్టులపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు
  2.  ఈవీఎంలపై విమర్శలు సరికావు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
  3.  మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా.. టైటిల్ అండ్ కాన్సెప్ట్ అదుర్స్!
  4. మన్సూరాబాద్‌లో స్వీట్ షాప్ వద్ద రక్తపాతం..!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు