Homeజాతీయంతమిళనాడులో మార్పు...! కేంద్రంతో త‌గ్గిన ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం...

తమిళనాడులో మార్పు…! కేంద్రంతో త‌గ్గిన ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం…

  • ప్రధాని మోదీ పర్యటనలో కనిపించని నిరసనలు

  • ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాల్లో మారిన వైఖరి

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : దేశ రాజకీయాల్లో కర్ణాటక రాజకీయం వేరుగా ఉంటుంది. అక్కడ జాతీయవాదం కంటే ప్రాంతీయవాదానికి బలం ఎక్కువ. సహజంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రతిసారి భిన్న స్వరాలు వినిపిస్తుంటాయి. రాజకీయ ఉద్రిక్తత, వ్యతిరేకత అనేది అక్కడ కామన్ పాయింట్. ప్రధాన ప్రతిపక్షాలు, కొన్ని ప్రత్యేక సంఘాలు గో బ్యాక్ మోది అంటూ నినాదాలు చేస్తుంటాయి. ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేయడం, రోడ్లపై నల్ల జెండాలతో నిరసనలు తెలపడం ఆనవాయితీగా వస్తోంది. కానీ తాజాగా చెన్నై మెట్రో పేజ్ 2 ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అటువంటివి కనిపించకపోవడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి చెక్ పడింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి విజయ్ అభినందనలు తెలపాల్సిందే.

గతానికి భిన్నంగా…

తమిళనాడులో గతానికి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఈసారి మోడీ పర్యటనలు ఎలాంటి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరగలేదు. చివరకు ఎప్పుడూ వ్యతిరేకించే డీఎంకే సహా ఏ ఇతర రాజకీయ పార్టీ, సంఘం కూడా మోడీ టూర్ను వ్యతిరేకిస్తూ నల్లజెండాలు ప్రదర్శించలేదు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రధానికి ఘనంగా స్వాగతం పలుకారు. ఆ తరువాత ఇద్దరు నేతలు కలిసి ఒకే వేదికపై కనిపించారు. మెట్రో రైలులో కలియతిరి గారు. ఈ పరిణామాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా.. ప్రశాంత వాతావరణంలో పర్యటన ముగియడం తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికింది.

మారిన సమీకరణలతో….

తమిళనాడు రాజకీయ సమీకరణలు మారడం వల్లే ఈ కొత్త పరిణామం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ… రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలోనే అధికారపక్షం వ్యవహరిస్తుండడం ఈ మార్పునకు కారణం. కేవలం రాజకీయ విమర్శలు, ఎడతెగని వ్యతిరేకత కంటే రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి ప్రాజెక్టుల సాధనే ముఖ్యమైన భావన క్రమంగా బలపడుతోంది. గతంలో మాదిరిగా కేంద్ర నాయకత్వం పై అనవసరమైన ప్రతిఘటనను పక్కనపెట్టి.. ప్రజా సంక్షేమం, మెట్రో వంటి బృహత్తర ప్రాజెక్టుల భాగస్వామ్యం వైపు రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపడం తమిళనాడులో వస్తున్న సానుకూల మార్పునకు ఒక నిదర్శనం.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. మన్సూరాబాద్‌లో స్వీట్ షాప్ వద్ద రక్తపాతం..!
  2.  మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా.. టైటిల్ అండ్ కాన్సెప్ట్ అదుర్స్!
  3. ఈవీఎంలపై విమర్శలు సరికావు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
  4.  ప్రభుత్వానికి భయం పట్టుకుంది’.. ఢిల్లీలో యువత అరెస్టులపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు