క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సర్పంచ్ పదవిని వేలం వెయ్యడం ఈ వేలం లో సర్పంచ్ పదవిని ఒక ముస్లిం మహిళ కుటుంబ సభ్యులు అత్యధికంగా రూ. 73 లక్షలు పలకడం ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…నల్గొండ జిల్లాలోని బంగారిగడ్డ గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం సర్పంచ్ పదవిని వేలం వేసిన సంఘటన జరిగింది.
ఈ వేలంలో సర్పంచ్ పదవిని ఒక ముస్లిం మహిళ తరపున ఆమె కుటుంబ సభ్యులు రూ. 73 లక్షలకు దక్కించుకున్నారు. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడానికి జరిగిన వేలంలో అత్యధికంగా రూ. 73 లక్షలు పలికింది. గ్రామాభివృద్ధి మరియు ఆలయ నిర్మాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
అయితే, ఈ విధంగా పదవులను వేలం వేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, వేలం జరిగిన చోట ఎన్నికలను రద్దు చేస్తామని హెచ్చరించింది.
గతంలో కూడా తెలంగాణలోని ఇతర జిల్లాలైన ఖమ్మం, నిర్మల్ వంటి ప్రాంతాలలో సర్పంచ్ పదవులను లక్షలకు వేలం వేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.





