
Earth Cool: భూమి చల్లగా మారబోతోంది. గత ఏడాదితో పోల్చితే మరింత చల్లదనాన్ని పొందనుంది. ఇలా మారడాన్ని అఫెలియన్ అంటారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 25 వరకు భూమి కాస్త చల్లగా మారతుందట. ప్రజలు ఆ చల్లదనాన్ని పొందడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భూమి చల్లగా మారడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.
భూమి ఎందుకు చల్లగా మారుతుంది?
సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరం 90,000,000 కి.మీ ఉంటుంది. అఫెలియన్ సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య దూరం 152,000,000 కి.మీ.కు పెరుగుతుందట. అంటే భూమి, సూర్యుడి మధ్య దూరం సుమారు 66 శాతం వరకు పెరుగుతుంది. ఈ దూరం వల్ల సూర్యుడి ప్రభావం తగ్గి భూమి చల్లగా మారుతుందట.
ప్రజలకు ఆరోగ్య సమస్యలు
అఫెలియన్ తో చాలా మంది ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. జలుబు, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలంటున్నారు.