తెలంగాణ

హస్తం గుర్తు పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులను సబితా ఇంద్రారెడ్డి తమ పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ యొక్క ముఖ్య నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని కాంగ్రెస్ నాయకులతోపాటుగా ప్రభుత్వానికే షాక్ ఇచ్చింది. దీంతో మెల్లిమెల్లిగా మళ్లీ గులాబీ పార్టీలోకి కొంతమంది ఇతర పార్టీల నాయకులు జాయిన్ అవడంతో… టిఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుతుందనే చెప్పాలి. అయితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలోని మహేశ్వరం లోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డి రోజురోజుకు కూడా కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులను తమలో కలుపుకొని పోవడం వల్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి శక్తివంతంగా తయారవుతుంది. ఇక మహేశ్వరం నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని పార్టీగా.. శక్తివంతంగా తీర్చిదిద్దుతూ ఉంది . తాజాగా ఇటువంటి తరుణంలోనే మాన్సాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో మహేశ్వరం నియోజకవర్గంలో పాటు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కూడా సరికొత్త జోష్లోకి వచ్చింది. సబితా ఇంద్రారెడ్డి ఇలాగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా భారీగా ప్రతిపక్ష పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరాలని పార్టీ పెద్దలు కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ వైపే వస్తున్నారని… రైతులు మన నాయకుడు కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి కొంతమంది కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని అనంతరం ఈ వ్యాఖ్యలను చేశారు. అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని బెదిరించడం… కాంగ్రెస్ కి అలవాటు అని … ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారత విమానాలకు ఇబ్బందులు!

మునుగోడు నుంచి కోమటిరెడ్డి అవుట్.. నెక్స్ట్ పోటీ చేసేది అక్కడే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button