Monday, February 16, 2026
Homeతెలంగాణరైతులకు తీపికబురు: ఒకే విడతలో పూర్తి నిధులు విడుదల..!

రైతులకు తీపికబురు: ఒకే విడతలో పూర్తి నిధులు విడుదల..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పనుంది. తొలుత శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కేవలం సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే అర్హులైన అందరు రైతులకు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఒకే విడతలో పూర్తి నిధులను విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ నేటితో (ఫిబ్రవరి 16) ముగియనుండటంతో, వెంటనే నిధుల విడుదల ప్రక్రియ మొదలుకానుందిని సమాచారం.

రైతు భరోసా నిధులను ఫిబ్రవరి 17, 2026 (రేపు) నుండి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. ఈసారి గతంలో వలె కాకుండా, ఒకే విడతలో పూర్తి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే RBI ద్వారా సుమారు ₹9,000 కోట్ల రుణం సేకరించిందిని తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments