Homeఅంతర్జాతీయంRussia vs WhatsApp: రష్యాలో వాట్సాప్ పై బ్యాన్, కారణం ఏంటంటే?

Russia vs WhatsApp: రష్యాలో వాట్సాప్ పై బ్యాన్, కారణం ఏంటంటే?

Russia Announces WhatsApp Block: ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై రష్యా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఫుతిన్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై దేశ వ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు అందుబాటులో ఉండవని ప్రకటించింది.

వాట్సాప్ పై నిషేధం ఎందుకు?

తమ దేశ చట్టాలను అమలు చేయనందుకు ఈ చర్య తీసుకున్నామని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి డిమిట్రీ ప్రెస్కోవ్‌ తెలిపారు. వాట్సాప్‌ మాతృ సంస్థ అయిన మెటా మొండివైఖరిని వీడి చర్చలకు వస్తే పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు, బెదిరింపు చర్యలకు వాట్సాప్‌ వేదికగా మారడంతో నిషేధం విధించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయంగా మ్యాక్స్‌ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

వాట్సాప్ ఏం చెప్పిందంటే?

అటు ఈ నిషేధంపై వాట్సాప్ స్పదించింది. ప్రభుత్వ ఆధీనంలోని నిఘా యాప్‌ను ప్రజలపై రుద్దడానికే తమపై నిషేధం విధించినట్టు ఆరోపించింది. మరోవైపు తమ కంపెనీకి కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారని టెలిగ్రాం వ్యవస్థాపకుడు పవేల్‌ దురోవ్‌ ఆరోపణలు చేయడం విశేషం.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments