Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్రాజధానిలో రియల్ ఎస్టేట్ మాఫియా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

రాజధానిలో రియల్ ఎస్టేట్ మాఫియా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి పనులు నోచుకుంటున్న సమయంలో PCC అధ్యక్షురాలు అయినటువంటి షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతి రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుంది అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మొదటి విడతలో ఎన్నో ఎకరాలు సేకరించారు. ఇక రెండో విడతలో సుమారు 17వేల ఎకరాలు కూటమి ప్రభుత్వం సేకరిస్తుంది. ఇవన్నీ కూడా అదాని లేదా అంబానీ కోసం చేస్తున్నవే అని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. మొదటి దశలో పనులు పూర్తికాకుండానే రెండో దశ భూ సేకరణ చేపట్టడం ఏంటి అని.. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అని ఆమె అన్నారు. ఇన్ని వేల భూసేకరణ చేసినప్పుడు రైతులకు ఎన్ని రిట్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారు అనేది తెలపాలి అనే డిమాండ్ చేశారు. అసలు ఇన్ని వేల ఎకరాలలో ఎన్ని కంపెనీలకు ఎంత భూములు ఇచ్చారు అనేది కూడా ఒక శ్వేత పత్రం ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. దీంతో ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయాన్ని షర్మిల రాజధాని రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుంది అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Read also : తుఫాన్ ప్రభావం.. ఏపీలో భారీ వర్ష సూచన జిల్లాలు ఇవే!

Read also : బ్రహ్మానందం ముసలి ముం*** అంటా.. రాజేంద్రప్రసాద్ వివాదాస్పాద వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments