Homeసినిమా16 ఏళ్ల తర్వాత రీరిలీజ్.. భారీ కలెక్షన్లు!

16 ఏళ్ల తర్వాత రీరిలీజ్.. భారీ కలెక్షన్లు!

క్రైమ్ మిర్రర్, సినిమా :- రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కరుణాకరన్ కాంబినేషన్లో వచ్చినటువంటి డార్లింగ్ అనే చిత్రం రీ రిలీజ్ తో సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుంది. 2010లో వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లోనే మంచి హిట్ అందుకుని భారీ కలెక్షన్లను రాబట్టగా ఇప్పుడు మరోసారి రీ రిలీస్ ద్వారా రికార్డ్స్ సృష్టిస్తుంది. 16 సంవత్సరాల క్రితం.. మళ్లీ రీ రిలీజ్ ద్వారా అవే రికార్డులు కొల్లగొట్టడం ప్రభాస్ అభిమానులకు ఇది ఒక సంతోషకరమైన వార్తగా మారింది. రీ రిలీజ్ ద్వారా విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 7.59 కోట్ల భారీ వసూళ్లు సాధించడం పట్ల ప్రభాస్అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా సంతోషంలో మునిగిపోయారు. మొన్నటి వరకు రీ రిలీజ్ ద్వారా విడుదలైనటువంటి స్టార్ హీరోల సినిమాలను అధిగమించి ఈ చిత్రం రికార్డులను కొల్లగొట్టి టాలీవుడ్ రీ రిలీజ్ చరిత్రలో రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ప్రభాస్ బాహుబలి ది ఎపిక్ సినిమానే కొనసాగుతుండడం విశేషం. కాగా గతంలో ఎన్నో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోలు సినిమాలు ఈమధ్య ఒక్కొక్కటిగా వివిధ సందర్భాలలో విడుదల చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి వంటి ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

ఈ రోజు బంగారు, వెండి ధ‌ర‌లు…!

మే నెల‌లో మోదీ తెలంగాణ రాక…ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంఖు స్థాప‌న‌లు …!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు