Homeజాతీయంప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. నకిలీ నోట్లకు చెక్ పెట్టే ఫీచర్లతో తీస్తున్న ఆర్బిఐ

ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. నకిలీ నోట్లకు చెక్ పెట్టే ఫీచర్లతో తీస్తున్న ఆర్బిఐ

క్రైమ్ మిర్రర్, జాతీయం:- దేశంలో సరికొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. కొన్నేళ్లుగా భారత్ లో ఉన్న నోట్ల స్థానంలో కొత్త నోట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో చాలావరకు నల్లధనానికి అడ్డుకట్ట పడింది. అయితే ఆర్బిఐ తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో నకిలీ నోట్లు చలామణి పెరిగిన నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు అనుగుణంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న కాగితపు కరెన్సీ నోట్లు కంటే ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉన్న ఈ ప్లాస్టిక్ కరెన్సీ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆర్బిఐ భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే చాలామంది ఒక పరిధి దాటిన లావాదేవీలను ఆన్లైన్లో చేయడానికి ఇబ్బందిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగదు ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. ఈ సమయంలో అనేకచోట్ల నకిలీ నోట్ల బెడద వేధిస్తోంది. వీటికి అడ్డుకట్టు వేసేందుకు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లును తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది.

కరెన్సీ నోట్లు విలువ భారీగా..

దేశంలో కరెన్సీ నోట్ల విలువ భారీగా ఉంది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశంలో రూ.42.86 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టినందుకు రిజర్వ్ బ్యాంకు కసరత్తు చేస్తోంది. ఏటా రిజర్వ్ బ్యాంకు ఉద్దేశంలో పాతబడిన, చిరిగిన కరెన్సీ నోట్లు ధ్వంసం చేస్తూ వస్తుంది. వీటి స్థానంలో కొత్త నోట్లను ముద్రించి విడుదల చేస్తుంది. ఈ విధంగా 2023-24 లో నోట్ల ముద్రణకు రూ.5,101 కోట్లు ఖర్చు చేయగా, 2024-25 లో వ్యయం రూ.6,372 కోట్లకు పెరిగింది. పెరుగుతున్న మూడు పదార్థాల ధరలతో ఈ వ్యయం మరింతగా పెరుగుతోందని ఆర్బిఐ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ప్లాస్టిక్ నోట్లను తీసుకువచ్చేందుకు ఆర్బిఐ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తొలిత ప్రయోగాత్మకంగా 10, 20 రూపాయలకు సంబంధించిన ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు విడుదల చేయనున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన, సౌలభ్యం, ముద్ర నా ఖర్చు వంటి అంశాలను బేరిజి వేసుకుని తదుపరి దశలో రూ.200, రూ.500 నోట్లు కూడా విడుదల చేయడానికి ఆర్బిఐ కసరత్తు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ నోట్లలో కూడా అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. దీనివల్ల నకిలీ నోట్లను చలామణి చేయడానికి అవకాశం లేకుండా చేయవచ్చని ఆర్బిఐ అధికారులు భావిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు