
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరిద్దరూ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీపావళి వేడుకగా మెగా ఫ్యామిలీలో డబుల్ ఆనందం తెచ్చి పెట్టిందని ఒక వీడియోను షేర్ చేశారు ఉపాసన. వీడియో వేరే ఏదో కాదు… ఉపాసన సీమంతం. ఈ సీమంతం వేడుకలలో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నట్లుగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటుగా ఉపాసన సీమంతపు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఉపాసన, రాంచరణ్ ఇద్దరు 2023 జూన్ నెలలో క్లిం కారకు జన్మనిచ్చారు. మరోసారి వీరిద్దరూ మరో బిడ్డకు త్వరలోనే జన్మనిస్తున్న కారణంగా ” సింబా ” వస్తున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన సీమంతం వేడుకల ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
Read also : ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..!
Read also : కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్‌లో చేరిక