-
రైల్వే గేట్లు లేని రాష్ట్రంగా తిర్చిదిద్దుతా
-
భూ సేకరణ పై కలెక్టర్‌లు ఫోకస్ చేయాలి
-
సీఎం చంద్రబాబు నాయుడు
నెల్లూరు, క్రైమ్ మిర్రర్ః శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 వరుసులకు రైల్వేలైన్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
రవాణ వ్యవస్థ బాగుంటే సరకరవాణకు ఉపయోగం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 774 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీ, ఆర్‌యూబీలను నిర్మించి, రైల్వే గేట్లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
హైదరాబాద్- అమరావతి- చెన్నై, హైదరాబాద్-బెంగళూరు వంటి బుల్లెట్ రైలు కారిడార్లు ఏపీ గుండా వెళ్లడం భారీ ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
రైల్వేతో పాటు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సైతం నిధుల కొరత ఉన్న కారణంగా, అందుకు అవసరమైన భూసేకరణపై కలెక్టర్లు ఫోకస్ చేయాలని సూచించారు.
గడువులోగా భూములు సేకరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఆర్టీసీలో 1000 విద్యుత్ బస్సులు…
అన్ని రకాల పంటల ఎగుమతుల కోసం మెరుగైన లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.
అలాగే సీ ప్లేన్ల నిర్వహణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 5.18 ఉన్న వ్యయాన్ని ఎలాగైనా సరే రూ. 4 లోపు (రూ. 3.90) తీసుకురావడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి, స్టోరేజీ, డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఒకే దగ్గర ఉండేలా నూతన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
పర్యావరణ హితం కోసం ఆర్టీసీలో 1,000 విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
భూగర్భ జలాలు ఒక్క మీటరు పెరగడం ద్వారా మనకు రూ.4 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని తెలిపారు.
కలెక్టర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వహించకుండా ఎక్కడ కూడలోటు పాట్లు లేకుండా పని చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకరావాలని కోరాఉ.









