
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గం, రావిర్యాల పెద్ద చెరువులో చేప పిల్లలు పంపిణీ చేయడానికి వచ్చిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేశ్వరం ఇంచార్జి కిచెన్న గారి లక్ష్మారెడ్డి ప్లెక్సీలు కనబడటంతో అధికారులపై మండిపడ్డారు. ప్రోటోకాల్ అనేది కూడ తెలియడం లేదని.. కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. రెండేళ్లు గడిచిన ఇప్పటి వరకూ కులవృత్తులకు ఒక్క అనాపైస కూడ ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రోటోకాల్ ని గంగలో తొక్కడం విడ్డూరంగా ఉందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. భారీ పోలీస్ బందోబస్త్ నడుమ చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read also : జాతీయ జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందే : బీసీసీఐ
Read also : కోటి సంతకాలు ఆత్మలు పెట్టాయా?.. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆగ్రహం!





