ఆంధ్ర ప్రదేశ్జాతీయం

పాక్ హీరోకి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్.. భగ్గుమంటున్న ఇండియన్స్!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- నిత్యం సోషల్ మీడియాలో ఎవరో ఒకరి మీద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిలిచే ప్రకాష్ రాజ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తరచూ ఏదో ఒక ప్రశ్నలు లేవనెత్తుతూ విరుచుకుపడుతూ ఉండేవారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు యావత్తు ఇండియన్స్ ను కోపానికి గురిచేసాయి. పాకిస్తాన్ సినిమాకు, పాకిస్తాన్ నటుడు అయినటువంటి ఫవాద్ ఖాన్ మూవీ.. అబీర్ గులాల్ ను తాజాగా భారత దేశంలో ఇటీవల నిషేధించడం జరిగింది. ఈ విషయం భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు తెలిసే ఉంటుంది. అయితే ఈ మూవీని బ్యాన్ చేయడం సరికాదని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా రిలీజ్ కాకుండానే బ్యాన్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక అది ఎలా ఉంటుందో అనేది… చూడాలా లేక చూడకూడదా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని అన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై యావత్ ఇండియన్స్ అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈమధ్య జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో… ఉగ్రవాదుల చేతిలో అమాయకమైన 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారతదేశవ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఇప్పటికే ఈ ఘటన పై భారత్ ఉగ్రవాదుల కోసం ప్రతిరోజు జల్లెడ పడుతూనే ఉంది. ఉగ్రవాదులకు సహాయం చేసిన పాకిస్తాన్ పై ఎలా అయినా ప్రతి కారం తీర్చుకోవాల్సిందే అని పట్టుబడి కూర్చుంది. ఇప్పటికే పాకిస్తాన్కు సరఫరా అయ్యేటువంటి దిగుమతులను అన్నిటిని కూడా బ్యాన్ చేసింది భారత్. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సినిమాలు అలాగే యూట్యూబ్ ఛానల్ ను కూడా భారతదేశం నిషేధం విధించింది. ఇలాంటి పనులు చేస్తున్న పాకిస్తాన్ కు ప్రకాష్ రాజ్ చాలా అనుకూలంగా మాట్లాడటం పట్ల నిటిజన్లకు ఏమాత్రం నచ్చకపోవడంతో… ప్రకాష్ రాజ్ పై కామెంట్లు రూపంతో నెటిజన్లు బగ్గుమంటున్నారు.

వైసీపీ ఓటమికి వాలంటీర్లే కారణం: గుడివాడ అమర్నాథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button