Saturday, February 21, 2026
Homeసినిమాదయచేసి ఆ పుకార్లు నమ్మొద్దు.. నటి రిక్వెస్ట్!

దయచేసి ఆ పుకార్లు నమ్మొద్దు.. నటి రిక్వెస్ట్!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-టాలీవుడ్ అలనాటి హీరోయిన్లలో మంచి గుర్తింపు పొందినటువంటి మీనా తన రెండో పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజుల నుంచి మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా.. తాజాగా నేడు మీనా ఈ విషయంపై స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు అని.. దయచేసి అటువంటి పుకార్లను ఎవరూ కూడా నమ్మొద్దు అని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా నా సెకండ్ మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి అని నాకు తెలుసు అన్నారు. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నాకు టీనేజ్ కూతురు ఉందన్న విషయాన్ని గుర్తించాలి అని కోరారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇలాంటి పుకార్లను చూస్తున్న ప్రతిసారి చాలా బాధ కలుగుతుంది అని అదే సమయంలో కోపం కూడా వస్తుంది అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నటి మీనా భర్త విద్యాసాగర్ 2022 కొన్ని కారణాల ద్వారా మరణించారు. ఆ తర్వాత హీరోయిన్ గా అలాగే తల్లి క్యారెక్టర్లు చేస్తూ ఒక నటిగా సినిమాలలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ మీనా.. మోహన్ లాల్ తో కలిసి దృశ్యం 3లో నటిస్తున్నారు.

href=”https://crimemirror.com/%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81/”>తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రభాస్!

కల్వకుర్తి ఏడిఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments