
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జరగబోయేటువంటి వరల్డ్ కప్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకు టి20 వరల్డ్ కప్ లు స్వయంగా ఆడుతూ అందులో ఉన్నటువంటి త్రిల్ ను ఎంజాయ్ చేసాను… కానీ ఈసారి స్టేడియం లోనూ లేదా ఇంట్లోను కూర్చుని చూడడం మరొక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని రోహిత్ శర్మ తెలిపారు. 2007వ సంవత్సరం నుంచి 2024 వరకు కూడా అన్ని టీ20 వరల్డ్ కప్లలో నేను ఆడాను.. కానీ ఈసారి వరల్డ్ కప్ మాత్రం ప్రత్యక్షంగా వీక్షించడం ఎలా ఉంటుందో అని తన అభిప్రాయాన్ని.. ఊహించే కోణాన్ని వివరించారు. కచ్చితంగా ఈసారి వరల్డ్ కప్ ఇంటి నుంచి చూడడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని పేర్కొన్నారు. గతంలో వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా మ్యాచ్ కు ముందు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. జట్టులో ఉన్నటువంటి 15 మందిని కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం ఒక కెప్టెన్ గా చాలా ముఖ్యమని కూడా రోహిత్ శర్మ తెలిపారు. మరి ఈసారి వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కచ్చితంగా నిరాశకు గురవుతారు.
Read also : మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్‌లో ‘Hi’ మెసేజ్ చేస్తే చాలు!
Read also : ఛీ..ఛీ.. నడిరోడ్డు మీద యువకుడి పాడుపని (VIDEO)





