Monday, February 16, 2026
Homeతెలంగాణమర్రిగూడలో ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తప్పనిసరి

మర్రిగూడలో ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తప్పనిసరి

•అనుమతి లేని ఫ్లెక్సీల ఏర్పాటుపై చర్యలు తప్పవు.
•మర్రిగూడ సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మర్రిగూడ మండల కేంద్రంలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు ఇరువైపులా ఇబ్బందికరంగా ఏర్పాటు చేసే, ఫ్లెక్సీల విషయంలో స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం జనవరి 5న ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మండల కేంద్రంలో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నా, గ్రామ పంచాయతీ ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని పాలక వర్గం స్పష్టం చేసింది.​ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఈ నూతన నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మర్రిగూడ గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారికంగా తీర్మానం చేసింది.

రైతులకు తీపికబురు: ఒకే విడతలో పూర్తి నిధులు విడుదల..!

ఏ రకమైన ప్రచార లేదా శుభాకాంక్షల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, అధికారులే స్వయంగా తొలగిస్తారని తెలిపారు.ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ నియమాలు పాటించడంలో, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామ పంచాయతీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ​మండల కేంద్రం పరిశుభ్రంగా ఉండే విధంగా, గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, సహకరించాలని పాలక వర్గం ఈ ప్రకటన ద్వారా కోరింది.

ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్: ఇద్దరు కౌన్సిలర్ల కిడ్నాప్..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments