
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023, డిసెంబర్ 7వ తేదీన అనగా సరిగ్గా నిన్నటి రోజున ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా బిజెపి ఎంపీ అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు అని ఆరోపించారు. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు వారి బంధువులు బాగా సంపాదించుకున్నారు అని కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తాజాగా బిజెపి ఎంపి అరవింద్ చార్జి షీట్ విడుదల చేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రజా వంచన చేసింది.. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు అని అన్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తన రెండేళ్ల అధికారంలో తన బంధువులకు అలాగే తన తోటి సహచరులకు బాగానే సంపాదించుకునేలా కృషి చేశారని వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం బిజెపి నేతల మధ్య వివాదాలు ఉన్నాయి అని ప్రతిపక్ష పార్టీల ఆరోపిస్తున్న వేళ బిజెపి ఎంపీ అరవింద్ అవన్నీ కూడా అబద్ధమని కొట్టిపారేశారు. రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ బలపడుతుంది అని ప్రస్తుతం బిజెపి నేతల మధ్య విభేదాలు ఏమీ లేవు అని స్పష్టం చేశారు. మరో వైపు కిషన్ రెడ్డి అలాగే మరికొంతమంది నాయకులు ఈ రెండేళ్లలో ప్రజలను పథకాల ద్వారా మోసం చేసింది అని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఎంపీ అరవింద్ అలాగే బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం గా రేవంత్ రెడ్డి నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు సంబరాలు చేసుకున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం అతడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ రెండేళ్ల పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Read also : సీఎంతో మ్యాచ్.. పకడ్బందీగా ఏర్పాట్లు
Read also : Nikhita Nagdev: మోదీ గారూ న్యాయం చేయండి, పాక్ మహిళ కన్నీటి ఆవేదన!





