
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు శివారులోని ఉడతలపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో శ్రీ సాయి వెంకటేశ్వర వండర్ సిటీ పేరుతో కొందరు వెంచర్ వేశారు. సర్వే నెంబర్ 188,216,217లలో వీరు వెంచర్ వేశారు. కాగా దీని పక్కనే ఉన్న 206 సర్వేలో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా రియల్టర్లు కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే కాకుండా సర్వేనెంబర్ 217 లో కూడా పూర్వపు బండ్లబాట నక్ష ప్రకారం ఉండగా దానిని కూడా కబ్జా చేసినట్లుగా తెలుస్తుంది. ఏడాది క్రితం ఈ కబ్జా పర్వం తెరమీదకి రావడంతో అధికార యంత్రాంగం కదిలింది. సర్వే చేశారు. కబ్జా జరిగిందని కూడా గుర్తించారు. సుమారు 2నుండి3 ఎకరాల వరకు కబ్జా జరిగినట్టుగా తెలుస్తోంది. కబ్జాకు గురైన భూమిని వెంటనే స్వాధీన పరచుకోవాలని ఆర్డీవో శ్రీదేవి 3.12.2024న తహసిల్దార్కు లేఖ పూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే నేటికీ అతిగతి లేకుండా పోయింది. ఆర్డీవో ఇచ్చిన ఆదేశాలే గాల్లో కలిసిపోయాయి అంటే ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో ఓ అధికారి పాత్ర కీలకంగా ఉందని ఆరోపణలైతే వినబడుతున్నాయి. ఈ విషయమై ఆర్డీవో శ్రీదేవిని వివరణ కోరగా ఆక్రమిత భూమిని స్వాధీనపరుచుకుంటామని తెలిపారు. కబ్జాయిన భూమిలో ఇప్పటికే ప్లాట్లు వేసి రియల్టర్లు విక్రయాలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. అధికారులు హద్దురాలు పాతి ప్రభుత్వ భూమి స్వాధీన పరుచుకుంటే మాత్రం ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోవాల్సిందే.
Read also : Jubli Hills By Polls Latest Update: కౌంటింగ్ 10 రౌండ్లలో పూర్తి
Read also : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..23 నెలల్లో 56వ ఢిల్లీ పర్యటన





