-
కబ్జా కోరల్లో ఆమనగల్లు శ్రీ శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రధాన రహదారి
-
రోడ్డు కుదింపుతో భక్తుల ఇక్కట్లు
-
మరో వైపు జాతర ఫ్లెక్సీలు తో మరింత ఇరుకుగా రోడ్డు
-
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
-
గ్రామస్తుల,దేవాలయం అర్చకుల ఆవేదన
క్రైమ్ మిర్రర్,తెలంగాణ స్టేట్ బ్యూరో: నల్గొండ జిల్లా, వేములపల్లి మండలము, ఆమనగల్లు గ్రామంలో కొలువుదీరిన, ఎంతో చరిత్ర కలిగిన, భక్తులకు ఆరాధ్యదైవమైన శ్రీ శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రధాన రహదారి ఇప్పడు కబ్జాదారుల్లో బందీ అయింది.

విశాలమైన రహదారితో విలసిల్లిన దేవాలయం నేడు కబ్జదారుల చేతిలో కీలుబొమ్మగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ అభివృద్ది జరుగాలి కాని గుడికి ఉన్న ప్రధాన దారి మూసి వేసే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాచీన దేవాలయ భక్తులకు మొక్కిన మొక్కులు తీర్చుస్తుందనే పేరుంది. దీంతో భక్తులు నిత్యం తరలివస్తుంటారు.

కాగా “గతమెంతో ఘనం ఇప్పుడు గతి లేని అన్నచందంగానే” ఉంది తప్ప గుడి అభివృద్దిలో ముందుకు పోయింది లేదనే చెప్పవచ్చు. అయితే ప్రతి సంవత్సరం హోలీ పండుగకు భారీ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను 3 నుంచి 4 రోజులు పాటు ఎంతో అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు.
ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. జాతర సందర్భంలో గుడికి వెళ్లే ప్రధాన ద్వారమైన దారి పూర్తిగా కబ్జాకు గురై కుచించుక పోవడంతో భక్తులు స్వామి దర్శనానికి వెళ్లాలంటే రోడ్డు పై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుందని వాపోతున్నారు.
కబ్జాకు గురైన ప్రధాన దారి (కమాన్)…..!
కమాన్ నుంచి గుడికివెళ్లే రోడ్డు ఇరువైపులా కబ్జాకు గురి కావడంతో ఒకప్పుడు ఉన్న రోడ్డు దగ్గరకు అయింది. వచ్చే నెల మార్చి 3న ఇక్కడ హోలీపండుగ కు పెద్ద జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. కాగా రోడ్డు చిన్నగా ఉండడంతో భక్తులు పడే ఇక్కట్లు అంతాఇంతా కాదని చెప్పవచ్చు.

కాగా గతంలో రోడ్డు వెడల్పు ఉండగా దానిని ఓ పక్క రైతులు, ఓ పక్క గ్రామస్తులు ఇండ్లు నిర్మించుకోవడంతో దారి వెడల్పు కుచించుకు పోయింది. ఇది ఇలా ఉంటే జాతరకు యూవత శుభాకాంక్షల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. దింతో ఆ దారి కాస్త ఇరుకుగా మారుతుంది. దీంతో భక్తుల రాక పోకలకు గంటల కొద్ది నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు…!
రోడ్డు విషయంపై రెవెన్యూ అధికారులకు, ఎండోమెంటు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు,దేవాలయం అర్చకులు ఆవేదన చెందుతున్నారు. ముందు రాబోయే జాతర వరకైన జిల్లా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డును వెలికితీసి దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు, దేవాలయం ఎండో మెంటో అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
