
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా పండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వీరిద్దరూ బ్యాడ్ బ్రదర్స్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి మా వంతుగా తీసుకువచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో డాక్యుమెంట్లతో సహా ప్రతి ఒక్కరికి వివరించే సత్తా నాకు ఉంది అని.. మరి మీరు తెచ్చినవి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని.. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి అలాగే న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని చెప్పుకొచ్చారు. ఒకవైపు రేవంత్ రెడ్డి.. మరోవైపు కేసీఆర్ ఇద్దరూ కూడా బ్యాడ్ బ్రదర్స్ అంటూ.. వీరిద్దరూ అధికారంలో ఉంటుండగా అవినీతికి పాల్పడ్డారు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకువెళ్లారు అని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కేటీఆర్ మరియు కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన సందర్భంలో.. తాజాగా మేము కాదు మీరే బ్యాడ్ బ్రదర్స్ అంటూ కిషన్ రెడ్డి తిరిగి కౌంటర్ వేశారు.
Read also : ఏంటి తమాషాలా?.. షమీ భార్యకు ఇచ్చి పడేసిన నెటిజనులు!
Read also : అమ్మానాన్న మీ కలలను నెరవేర్చలేకపోయా.. “నన్ను క్షమించండి” అంటూ నీట్ విద్యార్థి ఆత్మహత్య!





