తెలంగాణ

ఈ-పంచాయతీ యూనియన్ నల్లగొండ జిల్లా కొత్త భాద్యతలు

ఉపాధ్యక్షుడిగా కలకొండ శివకృష్ణ ఎంపిక

త్రిపురారం క్రైమ్ మిర్రర్, అక్టోబర్ 27: నల్లగొండ జిల్లా ఈ-పంచాయతీ ఉమ్మడి ఆపరేటర్స్ యూనియన్‌ కొత్త భాద్యతలను ఎంపిక చేసింది. నల్లగొండ కేంద్రంలో జరిగిన సమావేశంలో యూనియన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను ఎన్నుకున్నారు.

కనగల్ మండలానికి చెందిన కందుల వెంకన్న అధ్యక్షుడిగా, త్రిపురారం మండల ఈ-పంచాయతీ ఆపరేటర్ కలకొండ శివకృష్ణ ఉపాధ్యక్షుడిగా, అలాగే తండు లింగస్వామి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read:రేవంత్ కు షాక్.. నవంబరు 3 నుంచి అన్ని కాలేజీలు బంద్

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ఖాసీం, ఉమ్మడి ఈ-పంచాయతీ వింగ్ డీ.పీ.యం. బాణాల గంగాధర్ తదితరులు ఎన్నికైన నాయకులను అభినందించి సన్మానించారు.కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల ఈ-పంచాయతీ ఆపరేటర్లు, పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read:సీఎం రేవంత్ కు మరో మంత్రి ఝలక్.. తలపట్టుకున్న హైకమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button