- వ్యయం రూ. 2,750కోట్లు.
- దూరం. 130.28కిమీ
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దక్షిణ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లు అందుబాటు రానున్నాయి. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన వచ్చింది.. ఈ లైన్‌కు సంబంధించిన డీపీఆర్ రైల్వే బోర్డుకు చేరడంతో ఈ మేరకు అధికారులు కసరత్తు మెుదలు పెట్టారు. రూ.2,750 కోట్ల అంచనావ్యయంతో 130.28 కిమీ మేర దీన్ని రూపొందించారు. రైల్వేబోర్డు అనుమతి లభిస్తే ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కుతుంది.
వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ఎలైన్‌మెంట్ మార్పుచేర్పులతో ఖరారైంది. తొలుత దీనిని 120 కిమీ దూరం ఉంటే ఎలైన్‌మెంట్ మారాక 130.28 కి.మీ వరకు పెరిగింది. నిర్మాణ వ్యయం, భూసేకరణ ఖర్చులు కలిపితే అయ్యే మొత్తం ఖర్చు, వచ్చే రాబడి మధ్య చాలా అంతరం ఉందని, ఈ ప్రాజెక్టు లాభసాటి కాదని ముందుగా కేంద్రం అభ్యంతరం తెలిపినప్పటికి దక్షిణ తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో భూసేకరణకయ్యే మొత్తం వ్యయాన్ని భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి కేంద్రానికి తెలిపింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం రైల్వే మంత్రిని కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టుకు గురించి వివరించారు. ఈ మార్గంలో టేకల్‌కోడ్‌లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని తెలిపారు. దాంతో పాటు సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు.
తెలంగాణలో మరో కొత్త హైవే అందుబాటులోకి …
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ లో మహబూబ్‌నగర్- గుడబెళ్లూరు 4 లైన్ల హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు.ఇక మహబూబ్‌నగర్- గుడబెళ్లూరు ప్రాజెక్టు హైదరాబాద్ – గోవా ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉంది.
దీనివల్ల హైదరాబాద్ నుంచిరాయచూర్, మంత్రాలయం, మరియు గోవా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రూ.3,175 కోట్ల వ్యయంతో 80.01 కిలోమీటర్లు హ్యామ్ విధానంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది.ప్రస్తుతం ఉన్న 2 లైన్ల రోడ్డును 4 లైన్లుగా మార్చడం వల్ల ప్రయాణ సమయం దాదాపు 1.5 గంటలు తగ్గుతుంది.
ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే తెలంగాణలోని పరిగి, కొడంగల్, మక్తల్, నారాయణపేట వంటి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. అక్కడ పండించే ధాన్యం, పత్తి, మిర్చి వంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ఎరువుల సరఫరాతో పాటు సిమెంటు, గ్రానైట్ రవాణాతో పారిశ్రామిక అభివృద్ధికి, కొత్త పెట్టుబడులకు చాలా అవకాశం ఉంటుంది. మెుత్తంగా దక్షిణ తెలంగాణకు మహర్దశ పట్టడంతో పాటు రూపురేఖలు మారనున్నాయనే చెప్పవచ్చు
