Sunday, February 22, 2026
Homeతెలంగాణమంచిర్యాల మోడల్ స్కూల్ ను సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల మోడల్ స్కూల్ ను సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల,క్రైమ్ మిర్రర్:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌లో ఉన్న మోడల్ స్కూల్‌ను ఆదివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు.
ఈ సందర్భంగా ఎంపీ విద్యార్థులతో స్నేహపూర్వకంగా సంభాషించి, వారి విద్యా ప్రగతి, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో కల్పించాల్సిన సౌకర్యాలపై పాఠశాల అధికారులతో చర్చించారు. ఎంపీ గద్దం వంశీకృష్ణ ప్రభుత్వానికి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహార విందులో పాల్గొని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం,నాణ్యమైన విద్య కోసం తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథరెడ్డి పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read also : ఆకాశం నుంచి ఊడిపడ్డ వింత వస్తువు.. వీడియో ఇదిగో

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments