
క్రైమ్ మిర్రర్, వేములపల్లి:- నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని బుగ్గబాయ్ గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు పాల్వాయి నాగేష్ నూతనంగా వరి నాటు వేసే మిషన్ కొనుగోలు చేశాడు. ఈ మిషన్ ప్రారంభోత్సవాన్ని దీపావళి రోజున ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వరి నాటే మిషన్ ద్వారా రైతులు తొందరగా వరి నాటు వేసుకోవచ్చు అన్నారు. ఈ మిషన్ ఉపయోగించడం వల్ల సమయం వృధా కాకుండా తొందరగా వరిని నాటు చేయొచ్చని ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం పాల్వాయి నాగేష్ కుటుంబ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ చిరుమరి క్రిష్ణయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మాలి కాంతరెడ్డి, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పుట్టల కొమ్ము వెంకన్న, ఎన్.ఎస్.యు.ఐ లీడర్ బొంగర్ల వినోద్, మాజీ ఎంపీటీసీ చల్లా వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అలుగుబెల్లి సూర్య ప్రకాష్ రెడ్డి, జెట్టి నాగయ్య, గుర్రాల అశోక్, పుట్ట సందీప్, రాచకొండ వెంకన్న, జల్లాల సురేష్, పుట్ట శంకర్, ఈసరం మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Read also : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇవి పాటిస్తేనే?
Read also : నిజామాబాద్‌లో రియాజ్ ఎన్‌కౌంటర్.. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుకు ముగింపు