
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మరియు దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగునున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించి ఉప్పల్ స్టేడియం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మ్యాచ్ కోసం భారతదేశపు నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కూడా రానున్నారు అని ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్ కు సంబంధించి ఏర్పాట్లు అలాగే భద్రత చర్యలను కూడా ఇప్పటికే అధికారులతో కలిసి పరిశీలించారు బట్టి విక్రమార్క. చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అని తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ కు వస్తున్న మెస్సికి స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఒక తెలంగాణ గడ్డమీద ఇలాంటి స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ ను చూడాలని ఒక కలగా ప్రతి అభిమానికి ఉంటుంది అని.. ఇది ఒక ఎగ్జైటింగ్ మూమెంట్గా ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని అన్నారు. మెస్సి కీ ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమై ఎదురుచూస్తుంది అంటూ రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇందు కోసం ఇప్పటికే ప్రత్యేక భద్రత వ్యవస్థ అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. కాబట్టి ఎవరైతే ఈ స్టేడియానికి వచ్చేటువంటి ప్రేక్షకులు ఉంటారో నిర్ణీత సమయానికి ముందే స్టేడియానికి చేరుకోవాలి అని తెలియజేశారు.
Read also : మన సైనికుల తెలివితేటలు అద్భుతం : డిఫెన్స్ మినిస్టర్
Read also : Vande Mataram: వందేమాతరంపై ఇవాళ లోక్‌సభలో చర్చ, ప్రారంభిచనున్న ప్రధాని మోడీ!





