
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- గుర్తుతెలియని దుండగులు 40 తులాల బంగారం, ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కేశవనగర్(విద్యానగర్) కాలనీలో నివాసం ఉంటున్న ఊరుకొండ పేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస శర్మ ఇంట్లో దొంగలు పడి ఆరు లక్షల రూపాయలతో పాటు 40తులాల బంగారం తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. కూతురు పుట్టినరోజు సందర్భంగా అతని భార్య కూతురుతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చీరాలకు వెళ్లారు. శ్రీనివాస శర్మ మూడు రోజుల నుండి గుడి దగ్గరే ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో అదును చూసుకున్న దొంగలు తాళం విరగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారు జామున కూతురితో ఇంటికి వచ్చేసరికి తాళం విరగొట్టి ఉండడంతో భర్త శ్రీనివాస శర్మకు సమాచారం ఇచ్చారు. భార్యాభర్తలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అదే కాలనీలో 40 తులాల బంగారం మూడు లక్షల నగదు ఎత్తికెళ్ళిన దొంగ దొరికినట్లే దొరికి పారిపోవడంతో పట్టణ ప్రజలు భయాందోళన గురవుతున్నారు.

Read also : బిగ్ బాస్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్ ఖాన్.. ఎందుకంటే?
Read also : మల్లారెడ్డి పూలు, పాలు మాత్రమే కాదు.. భూకబ్జాలు కూడా చేశారు : కవిత





