క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు వెస్టిండీస్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. సూపర్ ఎయిట్ లో భాగంగా సెమీస్కు చేరేటువంటి కీలకమైన మ్యాచ్ లో శాంసన్ ఒంటి చేతితో టీమిండియాను గెలిపించారు. ఇక మ్యాచ్ గెలిపించడమే కాకుండా భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల రికార్డులు కూడా బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు నుంచి కూడా అసలు సాంసన్ కు చోటు దక్కుతుందా లేదా అన్న సందిగ్ధాలు నెలకొన్నాయి. కానీ తరువాత మ్యాచ్ లో అవకాశం రావడం.. మొదట్లో విఫలమైనప్పటికీ నిన్న జరిగినటువంటి కీలకమైన మ్యాచ్ లో ఒక్కడే చివరి వరకు నిలబడి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరి మనసును దోచుకోవడమే కాకుండా t20 ప్రపంచ కప్ మ్యాచ్లో కొన్ని రికార్డులు సాధించారు. ఈ టి20 ప్రపంచ కప్పులో అత్యధిక బౌండరీలు 16 బాదిన భారత్ ప్లేయర్ గా రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ లో 15 బౌండరీలు చేశారు. అలాగే ఇప్పటివరకు చేజింగ్ లో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ 82 ఉండగా నిన్నటి మ్యాచ్లో సాంసన్ 97 పరుగులు చేసి ఆ రికార్డును కూడా కొలగొట్టాడు. టి20 ఇంటర్నేషనల్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (3) దక్కించుకున్న ఇండియన్ వికెట్ కీపర్ సాంసన్ మాత్రమే. ఈ దెబ్బతో ఇక టీ20 మ్యాచ్లలో శాంసన్ ప్లేస్ ఫిక్స్ అవ్వటం ఖాయం.
కల్వకుర్తిలో యూరియా కోసం రైతుల ధర్నా
పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు
