Homeఆంధ్ర ప్రదేశ్APలో భారీగా పడిపోయిన టమాటా ధరలు.. రైతుల ఆవేదన!

APలో భారీగా పడిపోయిన టమాటా ధరలు.. రైతుల ఆవేదన!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రైతన్నలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా మరీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా మన రాష్ట్రంలో టమోటా ధరలు పతనమవుతుండడంతో టమాటా పండిస్తున్న రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 50 రూపాయలకు మూడు నుంచి నాలుగు కిలోలు ఇస్తున్నప్పటికీ తమకు కూలి ఖర్చులు సైతం రావట్లేదు అని రైతన్నలు వాపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లాలో 30 కిలోల టమాట ట్రే కేవలం 90 రూపాయలు మాత్రమే పలికినట్లుగా చెప్తున్నారు. గతంలోని మొంథా తుఫాన్ ప్రభావం వల్ల సాగు ఆలస్యం అవుతుండడం అలాగే 15 రోజులుగా పంట కోతకు వస్తున్న సందర్భంలో ధరలు భారీగా తగ్గాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఏపీలో మాత్రం టమాట పండిస్తున్న రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాభాల విషయం పక్కన పెడితే కనీసం పెట్టుబడికి కూడా రావడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడే మేము.. ఇలా పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఆత్మహత్య నే దిక్కు అంటూ చాలామంది కూడా తమ బాధను అధికారులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వీటిపై స్పందిస్తూ సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బ్రేక్

AP govt alert: గల్ఫ్ దేశాల్లోని ఏపీ పౌరులు భయపడొద్దు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు