
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:-బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అది భారీ వర్షాలు కురుస్తాయని APSDMA కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో వర్షాలు కురిసే జిల్లాలు:-
1. బాపట్ల
2. ప్రకాశం
3. నెల్లూరు
4. కడప
5. చిత్తూరు
6. కర్నూలు
7. తిరుపతి
ఏపీలోని ఈ ఏడు జిల్లాలలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాబట్టి ఈ ఏడు జిల్లాల ప్రజలు రెండు రోజులపాటు కాస్త అప్రమత్తంగా ఉండాలని… అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ నెల 23వ తేదీ ఉదయం నుంచి ఉరుములతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి ముఖ్యంగా వాహనదారులు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Read also : బ్రేకప్ అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బాధపడతారు : రష్మిక
Read also : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓకే… ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచుబోతుందా?