తెలంగాణ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 న లోక్ అదాలత్

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, తాలూకా కోర్టులలో ఈనెల నవంబర్ 15, 2025న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇది కక్షిదారులకు ఒక ప్రత్యేక అవకాశం అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరగకుండా మీ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు సూచిస్తున్నారు.

Also Read:ఒకవైపు కార్తీక పౌర్ణమి.. మరోవైపు వర్షపు ముప్పు

ఈ లోక్ అదాలత్ లో ఎ కేసులు పరిష్కరించబడతాయి: సివిల్ కేసులు, మోటారు ప్రమాదాల క్లెయిమ్‌లు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు మరియు రాజీ పడదగిన ఇతర క్రిమినల్ కేసులు.

ఎలా సద్వినియోగం చేసుకోవాలి: కక్షిదారులు తమకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవడానికి తమ దగ్గరలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority – DLSA) లేదా సంబంధిత కోర్టు సిబ్బందిని సంప్రదించవచ్చు. న్యాయవాదులు కూడా తమ క్లయింట్‌ల కేసులను ఈ అదాలత్‌లో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించబడింది.

Also Read:గల్లి గల్లీలో చెత్త ఉంది.. ఆ చెత్త నా కొడుకు వల్లే కదా : సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button