
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- శ్రీశైలం నల్లమల అటవి ప్రాంతంలో పులుల సంచారం కలకలం రేపుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా శ్రీశైలం పరిసర ప్రాంతాలలో చిరుతపులులు సంచరించడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇక తాజాగా నిన్న అర్ధరాత్రి సమయంలో శ్రీశైలం పాతాళ గంగ సమీపంలో ఓ చిరుత సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో పాతాళ గంగ సమీపంలో ఒక ఇంట్లోకి ప్రవేశించిన చిరుత పులి దృశ్యాలు సిసిటీవీలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఉదయాన్నే సీసీటీవీ ని పరిశీలించిన కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆలయ మైకుల ద్వారా అక్కడ ఉన్నటువంటి భక్తులు మరియు స్థానిక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున పాతాళ గంగలో పుణ్యా స్నానాలకు వెళ్లేటువంటి భక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు హెచ్చరించారు. అయితే గతంలో ఏడాది క్రితం జనవరి 6వ తేదీన ఇదే ఇంట్లోకి ఒక చిరుత పులి రావడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరి ఆ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నారు.
Read also : క్యాతనపల్లి మున్సిపాలిటీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
Read also : వెంటనే ఆ రెండు పార్టీలు క్షమాపణలు చెప్పాలి : బండి సంజయ్





