
తెలంగాణ, క్రైమ్ మిర్రర్:- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను (డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్) అధికారులు గురువారం విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ జాబితాను అధికారికంగా ప్రచురించారు. ప్రచురించిన ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, తప్పులు,సవరణలు అవసరమైన వారు లిఖితపూర్వక అభ్యంతరాలు,చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పుర ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్న వారు,కొత్తగా పేరునమోదుచేయించు కోవాలనుకునే వారు ఈ కౌంటర్లలో నేరుగా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు.వార్డుల వారీగా ఓటర్ల వివరాలు మున్సిపల్ కార్యాలయంలో పరిశీలనకు అందుబాటులో ఉంటాయని, రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా సరిచూసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read also : హైదరాబాద్‌లో విషాదం: రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట దంపతులు మృతి..!
Read also : మంత్రి వివేక్ కు శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు నేతలు





