
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా అగ్నికి ఆహుతి కాగా… మరో 20 మంది ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ బస్సు ప్రమాద ఘటనతో ప్రయాణికులు అందరూ కూడా ప్రైవేట్ బస్సులలో వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. కొంచెం ఆలస్యమైన పర్వాలేదు కానీ ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లడం చాలా మంచిది అని భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కన్నా ప్రైవేట్ బస్సుల్లో తక్కువగా భద్రత ఉంది అని ఇప్పటికే చాలామంది అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఆర్టిసి బస్సులు 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లలేవు. అదికాక డిపోలో మద్యం సేవించాడా లేదా అని చెకింగ్ చేసి మరీ డ్యూటీలోకి ఎక్కుతారు కాబట్టి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
Read also : తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను వ్యక్తిగతంగా కలవనున్న విజయ్!
మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్ అనే వ్యక్తి మద్యం తాగొచ్చు అలాగే తనకు నచ్చిన స్పీడులో బస్సును నడుపవచ్చు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాధారణంగా హైదరాబాద్ – విజయవాడ మధ్య సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉండగా ప్రైవేట్ బస్సులు మూడు గంటల్లోనే గమ్యానికి చేరుకుంటున్నాయి. అదే ఆర్టీసీ బస్సులు అయితే ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. దీన్నిబట్టి మనం ప్రైవేట్ బస్సులు ఎంత వేగంగా వెళుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో డిపో ఆంక్షలు స్పష్టంగా పాటిస్తూ ఉంటారు. కానీ ప్రైవేట్ బస్సుల్లో మాత్రం ఎటువంటి ఆంక్షలు పాటించాల్సిన అవసరం లేదు. దీంతోనే స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగితే మాత్రం భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలు చేయాలంటే ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణించాల్సి ఉంటుంది అని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : భారత్ కు గుడ్ న్యూస్… మళ్లీ ఆ ప్లేయర్స్ రీ ఎంట్రీ?




