క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. SLBC సొరంగం కూలి దాదాపు ఏడాది కావస్తున్న కూడా కార్మికుల మృతదేహాలను వెలికి తీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అలాగే మృతదేహాలు వెలికితీతలో, సొరంగం పనుల్లో పురోగతి లేకపోవడం అనేది ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ చేతకానితనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా కమిషన్ల పై పెట్టే శ్రద్ధను ప్రజా శ్రేయస్సుపై,రాష్ట్ర అభివృద్ధిపై పెడితే ఇలాంటి విషాదాలు మరోసారి పునరావతం కావు అని స్పెషల్ గా ట్విట్ చేశారు. కాగా 2025 ఫిబ్రవరి 22 ఇదే తేదీన జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది చనిపోయారు. కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికి తీశారు. ఈ ఘటన జరిగిన సందర్భంగా కేటీఆర్ ఇటువంటి ట్వీట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కాస్త చర్చనీయాంశమయ్యింది.
ఈనెల 26న ఇండియాతో జింబాబ్వే మ్యాచ్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్!
Tea: ఖాళీ కడుపుతో టీ తాగితే జరిగేది ఇదే!
