తెలంగాణ

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

అంబానీ, అదానీ, ఆర్ఎస్స్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనను ఫార్ములా -ఈరేసింగ్ కేసునుంచి తప్పించాలని ప్రాధేయపపడేందుకే వెళ్లారని చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు పొంగులేటి. తాను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్ కు తెలుసన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల హయాంలో చేసిన అవినీతి బాగోతాన్ని వెళికితిస్తే భూమి మీద నుంచి అంతరిక్షంకు వెళ్లి దాక్కునేలా ఉన్నారని సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై అధికార కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరిలో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ ఎక్కడున్నారు? ఎందుకు ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. ఎవరి కాళ్లు మొక్కి ఏం లబ్ధిపొందుదామని వెళ్లారని నిలదీశారు.
లిక్కర్ స్కాం కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లి బెయిల్ పొందినట్లుగానే తనను తాను కాపాడుకునేందుకు మళ్లీ ఢిల్లీ వెళ్లారా అంటూ హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్.

ఫార్ములా – ఈరేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు 55కోట్లను ఏవిధంగా మళ్లించారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. కేబినేట్ అప్రూవల్ , ముఖ్యమంత్రి అప్రూవల్ లేకుండానే కేటీఆర్ విదేశాల్లోని తొత్తు సంస్థలకు నిధులు మళ్లించారని చెప్పారు. ఫార్ములా – ఈరేసింగ్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం అంశంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించిందని తెలిపారు. ఫార్ములా – ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించిన కంపెనీతో MOU కుదుర్చుకోకమునుపే కేటీఆర్ నిధులను మళ్లించారని పొంగులేటి వెల్లడించారు.ఎవరి అనుమతి తీసుకోకుండా ఎవరికోసం 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మళ్లించారని ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకుని విచారించాలంటే దర్యాప్తు సంస్థలకు గవర్నర్ అనుమతి ఉండాలని ముందస్తుగా ఏసీబీ అనుమతి కోరిందని పొంగులేటి చెప్పారు. రేపో మాపో గవర్నర్ అనుమతి వస్తుందని ముందే గ్రహించిన కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తన బేస్ మార్చారని సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ, అదానీ, ఆర్ఎస్స్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనను ఫార్ములా -ఈరేసింగ్ కేసునుంచి తప్పించాలని ప్రాధేయపపడేందుకే వెళ్లారని చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు పొంగులేటి. తాను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్ కు తెలుసన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల హయాంలో చేసిన అవినీతి బాగోతాన్ని వెళికితిస్తే భూమి మీద నుంచి అంతరిక్షంకు వెళ్లి దాక్కునేలా ఉన్నారని సెటైర్లు వేశారు. కేంద్రపట్ఝణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి తనపై కేసు కాకుండా చూడాలని కేటీఆర్ ప్రాధేయపడుతున్నారని
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button