
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- కాశ్మీర్లో సామాన్య ప్రజలపై ఉగ్ర దాడులు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో దాదాపుగా 30 మంది సామాన్య ప్రజలు మరణించడం జరిగింది. ఒకవైపు పాకిస్తాన్లో తినడానికి కనీస గింజలు లేకపోయినా… టెర్రరిజాన్ని మాత్రం ప్రోత్సాహిస్తూనే ఉంది. పాకిస్తాన్ ప్రజలు కనీస అవసరాలకు ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ కాశ్మీర్ విభజన కోసం ఏమైనా చేసేలా ఉన్నారు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబన్లు దాడి చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను పాకిస్తాన్ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా కాశ్మీర్ ను మర్చిపోమంటూ దాడులకు దిగుతూనే ఉన్నారు. కులాలను చూడకుండా కేవలం హిందువులను మాత్రమే ఈ ఉగ్రదాడులలో చంపేశారు. దీంతో దేశంలోని హిందువులు కూడా చాలా కోపంగా ఉన్నారు. కాశ్మీర్ ఉగ్రదాడి వెనుక కచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ ఉంది. వారం రోజుల కిందటే మునీర్ అనే ఆర్మీ జనరల్ కాశ్మీర్ ప్రజల పోరాటానికి కచ్చితంగా మద్దతు ప్రకటిస్తామని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అంటే ఆయుధాలు అలాగే ఇతర సాయం చేసేటువంటి నెట్వర్క్ ను మళ్లీ విస్తరిస్తున్నారు.
ఎవరు ఊహించినటువంటి విధంగా పాకిస్తాన్ పై దాడి చేయాల్సిందే. పాకిస్తాన్ కు కచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. మరోసారి ఇండియా పై దాడులు చేయాలంటే అని వనికి పోయేలా ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. ప్రపంచంలోని చాలా దేశాలు.. ఆ దేశంలోని ప్రజల రక్షణ కోసం తమపై ఎవరు దాడి చేస్తారు వారిని ముందుగానే అంతం చేస్తూ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ అంత కూడా చూడాల్సిన సమయం వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్ష సహకారంతో చేసిన ఈ ఘోరాన్ని.. ఇండియా ఆర్మీ రివెంజ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. మరి వేరే దేశంలో పర్యటంలో ఉన్న మోదీ ఇవాళ మన దేశానికి రానున్నారు. అనంతరం ఆర్మీతో సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.