
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- కర్ణాటక స్టార్ క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ తాజాగా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ అనేది ప్రకటించారు. కేవలం కర్ణాటక జట్టులోనే కాకుండా ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో కూడా దాదాపు 5 జట్ల వరకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ 37 ఏళ్ల ఆల్రౌండర్ ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఐపీఎల్ లో దాదాపు 36 మ్యాచులు ఆడగా అందులో 247 రన్స్ అలాగే 21 వికెట్స్ సాధించారు. అంతేకాకుండా 59 ఫస్ట్ క్లాస్ మరియు 68 లిస్టు-A మ్యాచ్ల్లో కలిపి మొత్తం 320 వికెట్లు కూడా తీశారు.
Read also : ఆఫ్గాన్ వీధుల్లో నేను బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే తిరుగుతా : రషీద్ ఖాన్
ఇక 2016-17 సంవత్సరాలలో రంజీలో కేవలం ఎనిమిది మ్యాచ్లోని 27 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే తన కెరీర్లో హైయెస్ట్ రన్స్ 2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్లో 56 బంతుల్లోనే ఏకంగా 134 పరుగులు చేశాడు. దీంతో అతడు కెరీర్ మలుపు తిరుగుతుంది అని ప్రతి ఒక్కరు భావించినా కూడా ఆ తర్వాత పెద్దగా ఇతనికి అవకాశాలు అయితే రాలేదు. అయితే ఆడినన్ని రోజులు కూడా కృష్ణప్ప గౌతమ్ ఆయా జట్లకు అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. నేడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ అనేది ప్రకటించారు. ఈ రిటైర్మెంట్ పట్ల కృష్ణప్ప గౌతమ్ అభిమానులు అందరూ కూడా నిరాశలో ఉన్నారు.
Read also : Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్.. మేనేజ్మెంట్ కీలక నిర్ణయం!





