
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో భాగంగా భారత జట్టు స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనుబరుస్తున్నారు. పెర్త్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డక్ ఔట్ అయిన విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అయితే నేడు అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి రెండవ వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ బార్ లెట్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యారు. రెండుసార్లు డక్ అవుట్ అయిన విరాట్ కోహ్లీని చూసి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా బాగా రాణించాలని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ లో 8 పరుగులు చేసి నిరాశ పరిచిన రెండో మ్యాచ్లో 50 పరుగులతో రాణిస్తూ ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ అయితే రెండు మ్యాచ్లలో డక్కువుటయ్యి పూర్తిగా ఇండియన్ ఫాన్స్ ను నిరాశపరిచాడు. కాగా ఈరోజు జరుగుతున్నటువంటి రెండవ వన్డే మ్యాచ్ లో భారత్ ఆరంభంలో తడపడం… మెల్లిగా రోహిత్ శర్మ మరోవైపు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో రాణిస్తున్నారు. ప్రస్తుతం మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ 25 ఓవర్లకు 110 కి పైగా పరుగులు చేసింది. ఇవాళ జరుగుతున్న రెండో భారత్ గెలిస్తేనే సిరీస్ పై ఆశలు ఉంటాయి.
Read also : ఓటీటీ లో అడుగుపెట్టిన OG.. మరో రికార్డు సృష్టిస్తుందా?.
Read also : అందరి చూపు మేడారం వైపే… జాతరకు సంసిద్ధం కాండి..!





