ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ః పశ్చిమాసియలో రోజు రోజుకు యుద్దం తీవ్రమవుతున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోమవారం లోపు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్ తాజాగా పొడగిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి వరకు ఇరాన్ కు సమయం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి ఆశించిన స్పందన వస్తుందనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు ఇరాన్ ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ కీలక సముద్ర మార్గాన్ని స్వేచ్ఛగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గడువు పొడిగించడం అంటే చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఇంకా సజీవంగా ఉందని ట్రంప్ తన ప్రకటన ద్వారా తెలియ జేశారు.
కాగా ట్రంప్ ఇచ్చిన ఈ అదనపు సమయాన్ని ఇరాన్ సద్వినియోగం చేసుకుంటుందా? లేదా పశ్చిమాసియాలో మరో సుదీర్ఘ పోరాటానికి నాంది పలకనుందా? అనేది మంగళవారం రాత్రి తేలిపోనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఇప్పుడు వాషింగ్టన్ – టెహ్రాన్ వైపు ఆశగా, ఆందోళనగా చూస్తోంది.
