జాతీయం

స్టార్ హీరో కిచ్చ సుదీప్ తల్లి కన్నుమూత..!

కన్నడ స్టార్ హీరోలలో ఒకడైనటువంటి కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ గారు మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె వయసు రిత్యా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. కిచ్చ సుదీప్ తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ గురించి ఎన్నో సోషల్ మీడియాలు ద్వారా మనకు వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. తన తల్లి ప్రేమ గురించి బిగ్ బాస్ అలాగే ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా ఇవే కాకుండా ఎన్నో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కూడా తెలిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

కిచ్చ సుదీప్ కన్నడ సినిమాల్లోనే కాకుండా మన తెలుగు సినిమాల్లో కూడా చాలా బాగా నటించి తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. మన టాలీవుడ్ లోకి ఇచ్చే సుదీప్ చేసినటువంటి కొన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. కిచ్చ సుదీప్ ఈగ, విక్రాంత్ రోణా సినిమాల్లో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా అతని తల్లి పార్దేవదేహానికి సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కన్నడ హీరోలు కూడా కిచ్చా సుదీప్ ని కలిసి ఓదారుస్తున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా
  2. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. అసలు కారణం ఇదే!
  3. నారా రోహిత్ పెళ్లాడబోతున్న ‘సిరి’ బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా?
  4. ఒత్తిడి తట్టుకోలేక బిగ్ హౌస్ నుంచి పారిపోయిన కంటెస్టెంట్
Back to top button