
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచి 2024 ఎన్నికలలో జనసేన 100% గెలవడంలో కీలక పాత్ర పోషించిన నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే తాజాగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగబాబు అఫిడవిట్ లో ఆస్తులు మరియు అప్పుల వివరాలను తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ మరియు బాండ్ల పేరు మీద 55. 37 కోట్లు, బ్యాంకులో నిలువ చేసింది 23.53 లక్షలు, ఇక చేతిలో నగదు 21.81 లక్షలు ఉన్నాయట. ఇక ఇతరులకు ఇచ్చిన అప్పులు కోటి రూపాయలు.
ఎమ్మెల్సీ ఎఫెక్ట్ – కేబినెట్ నుంచి ఏడుగురు మంత్రులు ఔట్..?
అంతేకాకుండా అతని దగ్గర ఒక బెంజ్ కారు, 950 గ్రాముల బంగారం, 20 కేజీల వెండి, 55 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే 58 కోట్ల చేరాస్తులు, 11 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని నామినేషన్ అఫిడవిట్ లో తెలిపారు. అయితే ప్రస్తుతం మరో వార్త సంచలనంగా మారింది. చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల వద్ద ఏకంగా 35 లక్షల వరకు నాగబాబు అప్పు తీసుకున్నారు. చిరంజీవి నుండి 28 లక్షలు.. అలాగే పవన్ కళ్యాణ్ నుంచి ఆరు లక్షలు అప్పు తీసుకున్నారని తెలిపారు.
రేవంత్ మీటింగ్‌కు కిషన్ రెడ్జి, బండి సంజయ్!
కాగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనకు దిశా, నిర్దేశాలు చేస్తూ పార్టీ 100% గెలవడంలో కీలక పాత్ర పోషించారు నాగబాబు. అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించి నామినేషన్ దాఖలు చేయించిన విషయం మనందరికీ తెలిసిందే.